బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యకు సంబంధించి జరుగుతున్న విచారణలో సిబిఐ ఎప్పటికప్పుడు కీలక సాక్ష్యాలను సేకరిస్తూనే ఉంది. ముంబై పోలీసుల నుంచి నివేదికలను కూడా అందుకున్నారు. అంతే కాకుండా సుశాంత్ కి వంట చేసిన వంట మనిషిని కూడా అదుపులోకి తీసుకుని సిబిఐ విచారణ చేస్తుంది. ప్రస్తుతం సుశాంత్ తో లింకులు ఉన్న వారు అందరిని విచారణ చేస్తున్నారు.
ఇక సుశాంత్ నివాసంలో ఆయన వాడిన సబ్బుని కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇక సుశాంత్ చివరి సారి కాఫీ తాగిన కప్పుని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన వినియోగించిన ఆహార పదార్ధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ కేసుకి సంబంధించి కొందరిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయవచ్చునేమో అనే కథనాలు వస్తున్నాయి.