దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. కొద్ది సెకండ్ల పాటు ప్రకంపనలు రావడంతో ఇళ్లలోని వస్తువులు కదిలాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదయింది.
ఇళ్లలోని వస్తువులు కదులుతుండడంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం బయటికి పరుగులు తీశారు. ఇల్లు, కార్యాలయాల్లోని ప్రజలు భయంతో కేకలు వేస్తూ బయటకి పరుగులు తీశారు. అయితే ఈ భూ ప్రకంపనాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిసింది.