తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటినుండి సినిమా షూటింగ్స్ బందుకు పిలుపునిచ్చింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుండి షూటింగ్ లు అన్నీ నిలిచిపోనున్నాయి. తాజాగా జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో నిర్మాతలు అందరూ కలిసి రేపటి నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ సమస్యలు, ప్రొడ్యూసర్లు, థియేటర్ సమస్యలు పరిష్కారం అయ్యాక షూటింగ్స్ మళ్లీ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ పూర్తి మద్దతును తెలిపింది. దీంతో నిర్మాణంలో ఉన్న భారీ చిత్రాల నుండి స్మాల్ బడ్జెట్ చిత్రాల వరకు అన్ని షూటింగ్స్ రేపటినుండి ఆగిపోనున్నాయి.