చెక్ బౌన్స్ కేసులో ధోనిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

-

ధోని టీమిండియా కెప్టెన్ గా ఉన్న సమయంలో బీహార్ కు చెందిన ఓ ఫార్టీలైజర్ కంపెనీకి ప్రమోటర్ గా ఉన్నాడు. ఆ క్రమంలో ఓ ఎంటర్ప్రైజెస్ సంస్థ ధోని ప్రమోటర్ గా ఉన్న కంపెనీ నుంచి ఎరువులు కొనుగోలు చేసింది. అయితే ఆ ఎరువుల్లో నాణ్యత కొరవడిందని, అమ్ముడు పోలేదని కొనుగోలు చేసిన సంస్థ ఆరోపించింది. ఈ క్రమంలో వర్టిలైజర్ కంపెనీ ఆ ఎరువులను రిటర్న్ తీసుకుని 30 లక్షల చెక్కును ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీకి అందజేసింది. అయితే ఆ చెక్కు బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది.

దీంతో ఎరువుల కంపెనీ ప్రమోటర్ గా ఉన్న ధోనీతో పాటు మరో నలుగురికి లీగల్ నోటీసులు పంపింది ఆ ఏజెన్సీ. అందులో ధోని పేరుని కూడా చేర్చారు. అయితే చెక్ బౌన్స్ కేసులో ధోనికి ఊరట లభించింది. చెక్ బౌన్స్ కేసులో ధోనీకి ప్రమేయం లేదన్న అతడి తరపు లాయర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో ధోనితో పాటు మరో నలుగురిని దోషులుగా ప్రకటిస్తూ బేగుసరాయ్ కోర్టు తీర్పునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news