Breaking: గంగుల కమలాకర్ కు కరోనా పాజిటివ్

-

కరీంనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు.శనివారం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉండడంతో నిర్థారించిన పరీక్షలలో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని పేర్కొన్నారు గంగుల కమలాకర్. అయితే ఇటీవల తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఇక ఈ విషయం ఇటుంచితే..

పొరుగు దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న మంకీపాక్స్‌ తాజాగా ఇండియాలోకి కూడా ప్రవేశించింది. అయితే.. దేశంలోనే తొలిసారి మంకీపాక్స్ కేసు కేరళలో నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, మంకీపాక్స్‌ను ఎదుర్కోవడమెలా? ఎలాంటి రోగుల నుంచి శాంపిల్స్ సేకరించాలి? మంకీపాక్స్ సోకినట్టు ఎలా గుర్తించాలి? వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలా అడ్డుకోవాలి? వంటి అంశాలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Latest news