రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 61.68 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రూ.1496.07 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈనెలలో కొత్తగా 90,167 మందికి పెన్షన్ అందిస్తున్నారు. కొత్త పెన్షన్ దారుల కోసం రూ.21.36 కోట్లు కేటాయించారు. లబ్ధిదారుల చేతికే పెన్షన్ అందిస్తున్నారు 2.68 లక్షల మంది వాలంటీర్లు.
బయోమెట్రిక్ తోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉదయం 8 గంటల వరకు 16.01 లక్షల మందికి పెన్షన్లను అందించారు. మొత్తం 25.97 శాతం మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వృద్దులకు వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించడంపై ప్రసంశలు వస్తున్నాయి. జగన్ తీసుకున్న మంచి నిర్ణయం అని కీర్తిస్తున్నారు.