నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలిమేటి సంజీవయ్య. ఇతను గత ఎన్నికలో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. కాగా ఇతను ఇంట్లో పనిచేసే పనిమనిషి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన ఇప్పుడు సూళ్లూరుపేటలో కలకలం రేపుతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యే సంజీవయ్య ఇంట్లో చాలా కాలంగా అరుణకుమారి అనే ఒక వివాహిత పనిమనిషిగా ఉంటోంది. అయితే ఎమ్మెల్యే ఇల్లు అన్నాక ఎమ్మెల్యే ఆఫీస్ లో పనిచేసే వారు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. వారిలో ఒకరు ఈమెను వేధిస్తూ ఉండేవాడట. ఈ విషయం అరుణకుమారి కుటుంబసభ్యులకు కూడా తెలుసని వారే చెప్పారు. అయినప్పటికీ సర్దుకుంటుందిలే అనుకున్నారట.
కానీ ఈమె సూసైడ్ చేసుకోవడానికి ఈ వేధింపులే కారణం అవుతాయని తెలియలేదట. కాగా ఈ ఆత్మహత్య జరిగి మూడు రోజులు అయినా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ ఆత్మహత్యపై ఎమ్మెల్యే ఏమీ స్పందించలేదని తెలుస్తోంది.