మాచర్ల నియోజకవర్గం..మళ్ళీ వైసీపీ వశమే.!

మాచర్ల నియోజకవర్గం..పల్నాడు జిల్లా..ఈ రెండు పేర్లే ఎంత పవర్‌ఫుల్ గా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. అలాంటి పవర్ ప్లేస్ లో పవర్ లో ఉన్న వైసీపీ హవా స్పష్టంగా కొనసాగుతుంది. ఇప్పుడే కాదు వచ్చే ఎన్నికల్లో కూడా డౌట్ లేకుండా వైసీపీ జోరు కొనసాగేలా ఉంది. ఇక వైసీపీకి కంచుకోటగా ఉన్న మాచర్లలో ప్రత్యర్ధులు సైతం వెనుకడుగు వేసే పరిస్తితి. అయితే ఒకప్పుడు ఇక్కడ టి‌డి‌పి-కాంగ్రెస్ పార్టీల మధ్య వార్ ఎక్కువగా నడిచేది. రెండు పార్టీలు పోటాపోటిగా ఉండేవి.

ఇక్కడ టి‌డి‌పి నాలుగుసార్లు గెలిచింది..కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు గెలిచింది. అయితే 2012 నుంచే ఇక్కడ వైసీపీ హవా మోడలింది. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..వైఎస్సార్ చనిపోయాక కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. వైసీపీలో చేరారు. దీంతో 2012 ఉపఎన్నిక రాగా..అందులో విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో 3 వేల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి 21 వేల ఓట్ల మెజారిటీతో పిన్నెల్లి గెలిచారు.

అయితే పిన్నెల్లి అంటే ప్రత్యర్ధులకు కాస్త ఇబ్బంది గాని..ప్రజలకు కాదు. ఆయన ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ప్రజలకు కావల్సిన పనులు చేసి పెడతారు. మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక ఇక్కడ టి‌డి‌పి నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పనిచేస్తున్నారు. ఈయన కూడా దూకుడుగానే పనిచేస్తున్నారు. కానీ ఎంత దూకుడు ఉన్న పిన్నెల్లి మీద గెలుపు అనేది కష్టమే.

ఇక్కడ మెజారిటీ ప్రజలు పిన్నెల్లి వైపే ఉంటారు. రాష్ట్రంలో పరిస్తితులు ఉన్న మాచర్లలో మాత్రం వైసీపీదే హవా ..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏదేమైనా మాచర్ల నియోజకవర్గం మళ్ళీ వైసీపీ వశమే.