సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్ ఇస్తుండగా.. ఇప్పుడు పెంచిన వాటితో ఇది 46 లక్షలకు చేరుతుందన్నారు. పాత, కొత్త పెన్షనర్లకు బార్ కోడ్ లతో కొత్త పుస్తకాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్ లకు ప్రస్తుత సహకారం కొనసాగిస్తూనే కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
డయాలసిస్ పేషెంట్లకు రూ. 2016 రూపాయలు రూపాయలు ఇస్తామన్నారు. త్వరలోనే 57 ఏళ్లు కలిగిన వారందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు కేసిఆర్. అలాగే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏక్నాథ్ షిండేలను పుట్టిస్తారా అంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల మీద విధించే పన్నును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.