బ్రేకింగ్; ఫోన్ లో మోడిని బెదిరించిన ట్రంప్…?

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ ని బెదిరించారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోడికి ఫోన్ చేసి బెదిరించడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ పరిస్థితి మరింత దిగజారుతుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ దాదాపు నాలుగు లక్షల మందికి కరోనా వైరస్ సోకగా 10 వేల మంది మరణించారు.

దీనితో ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు మోకరిల్లే పరిస్థితి వచ్చింది. రష్యా, భారత్ లాంటి దేశాల నుంచి ఆయన సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో కరోనా వైరస్ ని నయం చేసే సామర్ధ్యం ఉంది. దీనితో ఆ మందుని తమకు కావాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ మందుని భారత్ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. తమకు అధికంగా కావాలని ట్రంప్ కి ఆదివారం మోడీ ఫోన్ చేసారు.

ఆ రోజే భారత్ ఎగుమతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 24 రకాల మందుల ఎగుమతులపై పాక్షికంగా నిషేధం విధించింది భారత్. దీనిపై మోడికి ఫోన్ చేసి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆ మందుని తమకు సరఫరా చేయకపోతే ఆయన హెచ్చరించినట్టు సమాచారం. అలాగే కఠిన ఆంక్షలు ఉంటాయని పరిస్థితి దారుణంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారట. అయితే మోడీ నుంచి స్పష్టమైన హామీ ట్రంప్ కి రాలేదని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news