బ్రేకింగ్ : “ఉస్తాద్ భగత్ సింగ్” గ్లింపస్ వీడియో రిలీజ్ టైం ప్రకటన … !

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి ఫస్ట్ గ్లిమ్పాస్ వీడియో ను విడుదల చేయడానికి టీం అంతా ప్రణాళిక చేసుకుంది. ఈ వీడియోను మే 11వ తేదీన ర్లీఏజ్ చేయనున్నామని ముందుగానే తెలిపినా సమయాన్ని చెప్పలేదు. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియా లో రేపు గ్లిమ్పాస్ వీడియోను విడుదల చేసే సమయాన్ని కూడా ప్రకటించారు. ఈ మెసేజ్ లో వీడియోను రేపు సాయంత్రం సరిగ్గా 4 .59 గంటలకు విడుదల చేస్తున్నారు. రేపు సాయంత్రం ఈ సమయం నుండి యు ట్యూబ్ ఈ వీడియోతో బ్లాస్ట్ అవుతుందని నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాలో పవన్ కు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా చేస్తుండడం విశేషం. ఇక మరో సారి దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. గబ్బర్ సింగ్ మూవీ తో హిట్ కొట్టిన వీరిద్దరూ మరో హిట్ ను ప్రేక్షకులకు అందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news