తెలంగాణ భవన్​లో BRS విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

-

తెలంగాణభవన్​లో బీఆర్ఎస్ విస్తృత స్ఖాయి సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్​ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు, కర్ణాటక ఫలితాలపై విశ్లేషిస్తున్నట్లు సమాచారం.

20 రోజుల వ్యవధిలో బీఆర్​ఎస్​ విస్తృతస్థాయి సమావేశం ఇవాళ మరోసారి జరుగుతోంది. గత నెల 27న.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. మళ్లీ 20రోజుల వ్యవధిలో.. కర్ణాటక ఫలితాలు వెలువడగానే.. మళ్లీ సమావేశం జరపడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రావిర్భావ దశాబ్ది వేడుకలే ప్రధాన అంశంగా సమావేశం ఉంటుందని.. పార్టీ నేతలు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు నవంబరు లేదా డిసెంబరులో జరగనున్నందున.. రోడ్‌ మ్యాప్‌పై కూడా సీఎం కేసీఆర్ పార్టీ వర్గాలకు మార్గనిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news