దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కవిత నిన్న రాత్రి దిల్లీ వెళ్లారు. హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో… ఆమె దిల్లీకి చేరుకున్నారు. కవితతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా హస్తినకు వెళ్లారు. దిల్లీ మద్యం కేసులో నేడు విచారణకు రావాలని… కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీచేసింది.
మహిళలను ఈడీ విచారించడంపై కవిత దాఖలు చేసిన పిటిషన్.. ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈలోపే కవిత ఈడీ విచారణ ఉండడం వల్ల… ఆమె హాజరుపై సందిగ్ధత నెలకొంది. దిల్లీ లిక్కర్ స్కామ్లో ఈనెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రాజకీయ వర్గాల్లో కవిత ఈడీ విచారణ చర్చనీయాంశంగా మారింది.