ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో తీన్మార్ మల్లన్న..!

-

నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందని.. ఆయన అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత హైదరాబాద్ లో పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ పెద్దలను తీన్మార్ మల్లన్న కలిశారు. ఎమ్మెల్సీ అంశంపై కూడా చర్చించినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు ఇప్పటికే ఒకసారి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు. మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. కేవలం ఏడాదిన్నర కాలం ఉన్న ఈ ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేసుకున్న తరువాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news