Telangana : పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించిన కేంద్రం

-

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు భారీ ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లు ఏవీ మంజూరు చేయకపోయినాపెండింగ్ ప్రాజెక్టులకు మాత్రం నిధులను పెంచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 45 శాతం నిధులు పెంచింది. గత బడ్జెట్‌లో రూ.3,045 కోట్లు నిధులిస్తే ఈ ఏడాది వాటిని రూ.4,418 కోట్లకు పెంచింది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు లైన్ క్లియర్ చేసింది.

ఏయే ప్రాజెక్టులకు కేంద్రం లైన్ క్లియర్ చేసిందంటే.. హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రెండో దశ, రామగుండం-మణుగూరు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. చర్లపల్లి టెర్మినల్‌కు, కాజీపేటలో వ్యాగన్‌ వర్క్‌షాప్‌నకు చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు లభించాయి. రైల్వేశాఖ జోన్ల వారీగా పింక్‌ బుక్‌ కేటాయింపులను పరిశీలిస్తే- నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజెక్టులకు ముఖ్యంగా రద్దీ మార్గాల్లో మూడో లైను పనులకే కొంత ప్రాధాన్యం లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news