ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గున కీలక ప్రకటన

-

అమరావతి : ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి బుగ్గన కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు మంత్రి బుగ్గన. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ… కరోనా వల్ల ప్రభుత్వానికి రాబడులు భారీగా తగ్గాయని… కరోనా కట్టడికి రూ. 7130.19 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు.పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నామని… కరోనా వల్ల రాష్ట్ర రాబడులు తగ్గలేదన్న ప్రతిపక్షాల వాదన అర్ధ రహితమని తెలిపారు.

గత ఏడాది కాలంలో పన్నుల్లో సాధారణ పెరుగుదల లేకపోవడం వల్ల రూ. 7947 కోట్లు ఆదాయాన్ని కొల్పోయామని… కరోనా లాక్ డౌన్ సమయంలో గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 4,709 కోట్లకు పడిపోయిందని వెల్లడించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఆ తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాల్లో పన్నుల రాబడి పెరగపోక.. తగ్గిందని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఇప్పటి వరకు రూ. 1,27,105.81 కోట్ల మేర అప్పు చేసి.. రూ. 1,05,102.22 కోట్లను ప్రజల ఖాతాల్లోకి నేరుగా జమ చేసిందన్నారు. కరోనా సమయంలో ఆత్మ నిర్బర్ ప్యాకేజీ కింద జీఎస్డీపీలో అదనంగా రెండు శాతం అప్పు తీసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిందని వెల్లడించారు. కేంద్ర అనుమతి మేరకే అప్పులు చేస్తోందని.. టీడీపీ హయాంలో చేసిన అప్పులు ఏపీ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దిగజార్చిందని తెలిపారు. రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్షాలు ఆర్థికపరమైన అంశాల్లో విష ప్రచారం చేస్తున్నాయని… దీని ద్వారా రాజకీయ లబ్ది పొందాలనుకోవడం హేమమైన చర్య ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news