టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌ : అందరినీ ఇరికించిన నవదీప్‌ !

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎఫ్ క్లబ్ వ్యవహారాలు ఒక్కక్కటి బయటపడుతున్నాయి. ఎఫ్ క్లబ్ చుట్టూ డ్రగ్స్ వ్యవహారం తిరుగుతోంది. ఎఫ్ లాంజ్ లో భారీగా పార్టీలు జరగగా… హీరో నవదీప్ చెందిన ఎఫ్ లాంజ్ పబ్బు నిత్యం పార్టీలు నిర్వహించిందని అధికారులు గుర్తించారు. 20 15 నుంచి 2018 వరకు వీకెండ్ లో పార్టీలు నిర్వహించింది.

నవదీప్, రకుల్, రానా దగ్గుపాటి , రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కలిసి పార్టీ నిర్వహించినట్లు గా గుర్తించారు ఈడీ అధికారులు. పూరి జగన్నాథ్‌ మరియు ఛార్మి లు కలిసి పలుమార్లు ఎఫ్ లాంజ్ పబ్లు పార్టీలు ఇచ్చినట్లుగా గుర్తించారు ఈడీ అధికారులు. ఈ నేపథ్యం లోనే ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ కి పెద్ద మొత్తంలో నిధులు బదలాయింపు అయినట్లు గుర్తించారు. ఎఫ్ లాంజ్ పబ్బు కేంద్రంగానే నడిచినట్లు నచ్చినట్టుగా గుర్తించారు ఈ డీ అధికారులు. డ్రగ్స్ వ్యవహారం బయటికి రాగానే పంపిణీ మరొకరికి ఈ డీలింగ్‌ ను అప్పగించాడు నవదీప్. ఈ విషయాలను కూడా ఈడీ గుర్తించింది.