రోడ్లు వేయండి.. నిధుల కోసం వెనుకాడొద్దు : సీఎం రేవంత్ రెడ్డి

-

HRDCL రోడ్డు నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరంలో నిర్మించాల్సిన రహదారులు, వాటి విస్తరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అవసరం అయితే అదనపు స్థల సేకరణ జరపాలని నిధుల కోసం వెనుకాడవొద్దని స్పష్టం చేశారు.

49 రోడ్ల నిర్మాణం, విస్తరణ పై సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధాన పెంచడం, ప్రజలు ఎటువంటి అవాంతరాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని సీఎం పేర్కొన్నారు. అనుసంధాన రహదారుల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తరణ విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. 

Read more RELATED
Recommended to you

Latest news