అమెజాన్‌ సేల్‌లో OnePlus Nord CE 3 Lite ఫోన్‌పై బంపర్‌ ఆఫర్‌..

-

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో ఆఫర్ల జాతర మొదలైంది. ఎలక్ట్రానిక్‌ వస్తువలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. ఐఫోన్‌ 14,14 ప్లస్‌పై కూడా ఘోరంగా తగ్గింపు ఉంది. అమెజాన్‌లో OnePlus Nord CE 3 Lite ధర కూడా బాగా తగ్గింది. గతంతో పోల్చితే.. చాలా తక్కువ ధరకే దీనిని కొనుగోలు చేయవచ్చు. OnePlus Nord CE 3 Lite ధర మనదేశంలో రూ. 19,999గా ఉంది. అయితే ఈ ఫోన్‌ను అమెజాన్ నుంచి రూ. 17,499 ధరకే కొనగోలు చేయవచ్చు.

OnePlus Nord CE 3 Lite 5G Review | A good alternative within its range -  The Hindu

కస్టమర్‌లు బ్యాంక్ ఆఫర్‌లు, కూపన్ ఆఫర్‌లను వినియోగించాల్సి ఉంటుంది. ఈ ధరకు OnePlus Nord CE 3 Lite 5G 8GB + 128GB వేరియంట్ లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా OnePlus Nord CE 3 Lite 5Gపై కస్టమర్‌లు అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్‌లో కూడా వస్తుంది. ప్రస్తుతం దీని ధరను రూ. 21,999గా నిర్ణయించారు. బ్యాంక్ ఆఫర్లు, కూపన్ల రూపంలో ఇది తక్కువ ధరకే లభిస్తుంది.

ఇక స్పెసిఫికేషన్‌లను చూస్తే…

ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది .
Qualcomm Snapdragon 695పై నడుస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 108MP ప్రైమరీ కెమెరా ఉండగా.. సెల్ఫీ కోసం 16MP కెమెరా ఉంది.బ్యాటరీ సామర్థ్యం 5,000mAh. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ OS 13.1తో ఈ వన్‌ప్లస్ ఫోన్ పనిచేస్తుంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.
వర్చువల్‌గా ర్యామ్‌ను 8GB వరకు పెంచుకోవచ్చు.
4G,5G సపోర్టెడ్ LTE, WIFI, 3.5 mm జాక్, బ్లూటూత్ 5.1, USB టైప్- సి పోర్ట్ ఉన్నాయి.
డ్యుయెల్ స్టీరియో స్పీకర్లతో పాటు, నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉంది.
ఇక జీరో నుంచి 80 శాతం వరకు బ్యాటరీని 30 నిమిషాల్లో ఫుల్ చేసేయొచ్చని తెలిపింది కంపెనీ
పాస్టల్ లైమ్, క్రొమాటిక్ గ్రే రంగుల్లో ఈ వన్‌ప్లస్ ఫోన్ లభ్యమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news