Pushpa 2 : పుష్ప-2 లో పులితో బన్నీ ఫైట్ ?

-

అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప-2’ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. దాంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప పార్ట్ వన్ ను మించి పార్ట్ టూ ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో క్యూట్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ కాగా, విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించారు. ఇక ‘తగ్గేదేలే’, అంటూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది ‘పుష్ప’. ఈ చిత్రం రెండో భాగంపై భారీ అంచనాలే ఉన్నాయి.

మేకర్స్ కూడా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారట. తాజాగా ఈ సినిమాకు చెందిన ఓ అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ పులితో పోరాడే సీన్ ఒకటి షూట్ చేసేందుకు థాయిలాండ్ వెళ్లనుందట మూవీ టీం. ఇదే నిజమైతే RRR లో ఎన్టీఆర్-పులి ఫైట్ లాగే ఇది కూడా హైలెట్ అవుతుందని కృషి అవుతున్నారు ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news