బిజినెస్ ఐడియా: ఈ చెట్లతో లాభాలే లాభాలు..!

-

చాలా మంది ఈ మధ్య వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు ఉద్యోగాలని కూడా వదిలేసుకుని నచ్చిన వ్యాపారాలని చేస్తున్నారు. మీరు కూడా ఏదైనా మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని నుండి మంచిగా లాభాలని పొందాలని చూస్తున్నారా..? అయితే ఈ ఐడియా ని కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఈ బిజినెస్ ఐడియా ని అనుసరించడం వలన మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు.

ఈ మధ్య కాలం లో చాలా మంది పంటలు పండిస్తూ చక్కటి రాబడిని పొందుతున్నారు. అయితే మామూలు పంటల కంటే కూడా మహోగని చెట్లని పెంచడం వలన చక్కటి లాభాలు వస్తాయి. మహోగని చెట్లని పెంచడానికి ఏం చేయాలి..? లాభాలు ఎలా వస్తాయి అనే విషయాలని ఇప్పుడు చూద్దాం. ఈ చెట్లు 40 నుండి 200 అడుగుల వరకు పెరుగుతాయి ఈ చెట్ల వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లలేవు. పైనే ఉంటాయి.

బలమైన గాలులు వీస్తే మాత్రం పడిపోతాయి. ఈ మొక్కలకి ఎక్కువ నీళ్లు కూడా అవసరం ఉండదు. కరువు ప్రాంతాల్లో అయితే ఇవి బాగా పెరుగుతాయి. మన దేశంలో 60 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఇవి పెరగగలవు. ఈ చెట్టు చెక్క చాలా బలంగా ఉంటుంది. ఫర్నిచర్ వంటి వాటికి ఉపయోగపడుతుంది. ఈ చెట్టు పూలు, విత్తనాలు శారీరక శక్తిని పెంచడానికి ఔషధాలలో వాడుతూ ఉంటారు. ఒక కిలో మహోగని విత్తనాలు వెయ్యి రూపాయల వరకు ఉంటాయి. ఒక చెట్టు పూర్తిగా ఎదిగి కోతకు రావడానికి 12 ఏళ్లు పడుతుంది. కానీ దీనిలో ప్లస్ ఏంటంటే ఈ మొక్కల్ని ఒకసారి నాటి అలా వదిలేస్తే అవే పెరిగిపోతాయి ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news