రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్..? స‌చివాల‌యం కూల్చివేత‌ షురూ..!

-

ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన తెలంగాణ సచివాలయ భవనం ఇక కనమరుగుకానుంది. త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభంకానుంది.. తెలంగాణ రాష్ట్రంలోని పాత సచివాలయం భవనాలను కూల్చేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజాము నుంచే భారీ యంత్రాలతో భవనం కూల్చివేత పనులు చేపట్టారు. అలాగే ఆ వైపుగా వాహనాలు రాకుండా రోడ్లను మూసివేశారు.

పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి అదే స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోర్టు కొత్త స‌చివాల‌య నిర్మాణాన్ని చేసుకోవ‌చ్చు అని తీర్పునిచ్చింది కానీ పాత స‌చివాల‌యాన్ని కూల్చాల‌ని చెప్ప‌లేద‌ని టీజేఎస్ అధినేత కోదండ‌రాం ప్ర‌క‌టించారు. అలాగే ప్రతిపక్ష నేతలు ఈ చర్యను తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా గలాటా జరగవచ్చని భావించిన కేసీఆర్ సర్కార్.. ముందస్తు భాగంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news