కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ ఒకేసారి వస్తాయా…?

-

కరోనా మహమ్మారి అందర్నీ పట్టిపీడిస్తోంది. దేశమంతా కూడా కరోనా వలన ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండువ వేవ్ లో లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. రికార్డు స్థాయిలో కూడా కేసులు నమోదు అవ్వడం మనం చూశాం.

భారతదేశ హెల్త్ కేర్ ని కూడా ఒత్తిడి లోకి తీసుకెళ్ళి పోయింది. అయితే ఈ వైరస్ మాట పక్కన పెడితే మూకర్మైకోసెస్ కూడా అందరినీ భయాందోళనలకు గురి చేసింది. చాలామంది ఈ బ్లాక్ ఫంగస్ బారిన కూడా పడినట్లు మనం విన్నాం. అయితే బ్లాక్ ఫంగస్ మరియు కరోనా ఒకసారి రావచ్చా…?

ఈ విషయం గురించి చూస్తే… ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కరోనా తో పాటు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఐసీయూలో ఉన్న వారికి లేదా డయాబెటిస్ లేదా హెచ్ఐవి ఉన్న వాళ్లకి ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు.

దీని యొక్క లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలిపారు. మన భారత దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చినట్లు రిపోర్ట్ అయింది. బ్లాక్ ఫంగస్ తాలూక లక్షణాలు గురించి చూస్తే… జ్వరం, చలి, నాసల్ డిశ్చార్జ్, తల నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news