విధుల్లో నిర్లక్ష్యం… జీతాలు నిలిపివేస్తూ కలెక్టర్‌ సంచలన నిర్ణయం

-

చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఉద్యోగుల జీతాలు నిలిపివేసారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జిల్లాలోని పెదమండ్యం, తవణంపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె మొత్తం 5 మండలాల ఉద్యోగుల జీతాలు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య , సచివాలయ, మున్సిపల్ శాఖల ఉద్యోగుల నెల జీతాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సదరు శాఖల ఉద్యోగుల జీతాలు నిలిపివేయాలని జిల్లా ట్రెజరీని కలెక్టర్‌ ఆదేశించారు.


కాగా ఆరో విడత ఫీవర్ సర్వేలో ఆయా మండలాల్లో అధికారులు నిర్లక్ష్యం వహించారని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపైనా ఇదే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కాగా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా సమయానికి జీతాలు తీసుకుంటూ విధుల్లో నిర్లక్ష్యం వహించే వారి పట్ల కలెక్టర్‌ ఇలాంటి చర్యలకు ఉపక్రమించడం సరైన నిర్ణయమేనని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు .

Read more RELATED
Recommended to you

Latest news