ఎన్నో స్కీమ్స్ ని కేంద్రం తీసుకు వచ్చింది. అయితే పోస్టాఫీసులో కూడా చాలా స్కీమ్స్ వున్నాయి. వీటిలో డబ్బులు పెడితే మంచిగా లాభాలు వస్తాయి. వడ్డీ రేట్లు కూడా ఎక్కువే ఉంటుంది. ఎటువంటి రిస్క్ ఉండదు పైగా మంచిగా లాభాలు వస్తాయి కనుక చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం కూడా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఒకటి. ఈ స్కీమ్ లో మీరు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో వడ్డీ 5.8 శాతంగా ఉంటుంది. ఏడాది కానీ రెండు లేదా అంతకంటే ఎక్కువ సమయం అయినా సరే పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేట్లు మూడేళ్లకు ఒకసారి మారుతాయి. దీనిలో ఇన్వెస్ట్ చేస్తే లక్షలాది రూపాయలు పొందొచ్చు.
లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ స్కీమ్ కింద 12 వాయిదాలు జమ చేస్తే లోన్ కూడా తీసుకోచ్చు. అకౌంట్ లో జమ చేసిన దానిలో యాభై శాతం లోన్ మనకు వస్తుంది. నెలకు రూ.10వేల చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే 10 సంవత్సరాల తరవాత రూ.16 లక్షల వరకు బెనిఫిట్ పొందేందుకు అవుతుంది.
10 సంవత్సరాల్లో మీరు 12 లక్షలు జమ చేస్తే తర్వాత 4 లక్షల 26 వేల 476 రూపాయలు మీరు పొందేందుకు అవుతుంది. ఇలా 10 సంవత్సరాల తర్వాత 16 లక్షల 26 వేల 476 రూపాయలు వస్తాయి. మీరు పూర్తి వివరాల కోసం దగ్గరలో వుండే పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్లి తెలుసుకోవచ్చు. అకౌంట్ ని ఓపెన్ చేయచ్చు.