కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ ద్వారా చాలా మంది ఎన్నో రకాల లాభాలని పొందుతున్నారు. అయితే కేంద్రం దేశంలో అసంఘటిత రంగం లో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కూడా కొన్ని స్కీమ్స్ ని తీసుకు వచ్చారు. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన కూడా ఒకటి.
ఈ స్కీమ్ ద్వారా చాలా మంది బెనిఫిట్స్ ని పొందుతున్నారు. ఇందులో కార్మికులు రోజుకు కేవలం రూ. 2 పెట్టుబడి పెడితే చాలు. ఏడాదికి రూ. 36,000 పెన్షన్ వస్తుంది. ఇక ఈ స్కీమ్ కోసం ఎవరు అర్హులు అనేది చూస్తే.. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వాళ్ళు ఈ స్కీమ్ కి అర్హులు.
ఈ స్కీమ్ లో చేరాలంటే ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా ఉండాలి. ఈ స్కీమ్ లో డబ్బులని పొందాలంటే ప్రతి నెల రూ. 55 చెల్లించాలి. 60 ఏళ్లు దాటితే పెన్షన్‌ను పొందొచ్చు. వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, భవని నిర్మాణ కార్మికులు మొదలైన అసంఘటిత రంగం లో పని చేసే వాళ్లకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. రోజుకు రూ. 2 చెల్లించి 18 ఏళ్ల పాలసీ తీసుకో వచ్చు. 40 ఏళ్ల వయస్సు వున్న వారు ప్రతి నెలా రూ. 200 పే చెయ్యచ్చు. రూ.15000 కంటే ఆదాయం ఉంటే ఈ స్కీమ్ లో చేరచ్చు.