BREAKING : ఏపీలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన జగన్ సర్కార్ !

-

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్‌ తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రవైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా మాండుస్‌ తీవ్ర తుపాను దాదాపు 12 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా వెళ్లి నైరుతి మీదుగా పయనిస్తోంది. ట్రింకోమలీ (శ్రీలంక)కి ఉత్తర-ఈశాన్యంగా 240 కి.మీ., జాఫ్నాకు 270 కి.మీ తూర్పు-ఈశాన్య (శ్రీలంక), కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 270 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంలో 350 కి.మీ. వద్ద కేంద్రీకృతమై ఉంది.

మాండౌస్‌ ఈ రోజు తీవ్ర తుపానుగా మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్ తీవ్ర తుఫాను కొనసాగుతుండగా, ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజాము లోపు తీరం దాటి అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు అలాగే అన్నమయ్య జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించగా, అధికారులకు సెలవులు రద్దు చేసింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news