లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని తీసుకు వచ్చింది. వీటి వలన ఎన్నో లాభలను కస్టమర్స్ పొందొచ్చు. ఈ మధ్య కాలం లో చాలా మంది పాలసీలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. అయితే ఎల్‌ఐసీ నుంచి ఓ కొత్త స్కీమ్ అందుబాటులో ఉంది. దాని పేరు ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకం.
ఈ స్కీమ్ లో కనుక చేరారు అంటే ప్రతీ నెలా కూడా పెన్షన్ వస్తుంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇది వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన పథకం. రిటైర్‌మెంట్ సమయంలో వచ్చిన డబ్బులను ఒకేసారి ఇన్వెస్ట్ చేసి నెల నెలా మీరు పెన్షన్ పొందొచ్చు. ఈ స్కీమ్ మీద వడ్డీ ఇప్పుడు 7.40 శాతం వుంది. అంటే నెల నెలా రూ.9,250 పెన్షన్ పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం గడువును 2023 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ గడువులోగా స్కీమ్ లో చేరచ్చు. రూ.1,62,162 ఇన్వెస్ట్ చేసిన వారికి నెలకు రూ.1000, మూడు నెలలకు రూ.3000, ఆరు నెలలకు రూ.6000, ఏడాదికి రూ.12,000 చొప్పున పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్ లో గరిష్టంగా రూ.15,00,000 ఇన్వెస్ట్ చేసే అవకాశం వుంది.
ఇక 60 ఏళ్లు దాటిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా పెన్షన్ స్కీమ్‌లో రూ.30,00,000 వరకు పెట్టుబడి పెట్టి నెలకు రూ.18,500 చొప్పున పెన్షన్ పొందవచ్చు. పాలసీ గడువు ముగిసిన తర్వాత పెట్టిన పెట్టుబడి రూ.15,00,000 వెనక్కి ఇచ్చేస్తారు. 60 ఏళ్లు దాటిన వృద్దులు ఎవరైనా చేరవచ్చు. మూడేళ్ళ తరవాత లోన్ కూడా పొందొచ్చు. గరిష్టంగా 75 శాతం వరకు రుణం వస్తుంది.