ప్రభాస్ ఇన్ని సినిమాల భారం మోయగలడా..!!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  బాహుబలి సినిమా తో వచ్చిన గ్యాప్ పూడ్చడం కోసం  బాగా కష్టపడుతున్నాడు. ఎందుకంటే నటించాల్సిన సినిమాలు వరసగా ఉన్నాయి.  ప్రభాస్ తాను వచ్చిన మొదట్లో  కంటే ఇప్పుడే బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తో కలిసి తొలి బాలీవుడ్ మూవీగా ‘ఆది పురుష్’లో నటిస్తున్న ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేసాడు. దీని ప్రమోషన్స్ కు టైమ్ కేటాయించవలసి వుంది.

అలాగే ప్రస్తుతం తన దృష్టి అంతా రెండు ప్రాజెక్ట్ లపై పెట్టాడు. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రపంచ స్తాయిలో తీస్తున్న ప్రాజెక్ట్ k లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ కంప్లీట్ చేయవలసి ఉంది. తన బాబాయ్ కృష్ణం రాజు మరణం తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు. మళ్లీ ఇప్పుడిప్పుడే పనిలో కాన్సంట్రేట్ చేస్తున్నాడు.

అలాగే తాను  మారుతి ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  ఈ సినిమా ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ – మారుతి సినిమాకి డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది  చూస్తూంటే తాను కమిట్ మెంట్ ఇచ్చిన వారందరికీ వీలైనంత తొందరగా సినిమాలు చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. తన కెరియర్ లో రాదే శ్యామ్,బాహుబలి వంటి సినిమా లకు మొత్తంగా 8 సంవత్సరాల తన విలువైన సమయం కేటయించాల్సి వచ్చింది.. కేవలం 3 సినిమా లకే అంత టైమ్ పడితే నెక్స్ట్ ఇలాగే వుంటే కష్టం అని కష్టపడి స్పీడ్ గా అన్ని సినిమాలని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news