జోగులాంబ ఆలయ హుండీలో రూ.100 కోట్ల చెక్కు.. కానీ..

-

అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ గద్వాల్‌ జిల్లాలోని ఆలంపూర్‌లో జోగులాంబ అమ్మవారి ఆలయం ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం. అయితే.. ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. కాగా, జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీలో నగదు లెక్కిస్తున్న సమయంలో రూ.100 కోట్ల చెక్కును చూసి అదిరిపడ్డారు అధికారులు. ఆలయ చరిత్రలో అంత పెద్ద మొత్తం హుండీ ద్వారా ఎప్పుడూ లభించలేదు. ఆ చెక్కుపై ‘అక్షరాలా వంద కోట్ల రూపాయలు’ అని రాసి ఉంది. అయితే ఆ చెక్కు నిజమైనదేనా అని అనుమానం వచ్చిన ఆలయ అధికారులు ఆరా తీస్తే ఆసక్తికర అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Jogulamba Temple Shakthipeetham (Alampur) - Picture of Raghavendra Swamy  Temple, Mantralayam - Tripadvisor

ఆ చెక్కు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వరంగల్ బ్రాంచికి చెందినదని తెలిసింది. ఆ చెక్కును హుండీలో వేసిన వ్యక్తి ఆలంపూర్ మండలానికి చెందినవాడే. అయితే అతడికి మతిస్థిమితం లేదని గుర్తించారు. ఇక, వంద కోట్లు అని రాసిన ఆ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఉన్నది కేవలం రూ.23 వేలేనట. అతడు తన చెక్కుపై ‘ఆర్మీ జవాన్ల కోసం’ అని రాసి ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కాగా, ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి రీత్యా పోలీసులు అతడిని హైదరాబాదులోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్పించినట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news