క్యాబేజీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? కానీ వాళ్లు తింటే మాత్రం..

-

క్యాబేజీ, కాకరకాయ అంటే.. చాలామంది ఆకలి కూడా చచ్చిపోతుంది. అస్సలు ఇష్టం ఉండదు.. కాకరకాయ అయినా ఇష్టపడేవాళ్లు ఉంటారేమో కానీ.. క్యాబేజీని మాత్రం చాలా తక్కువమందే ఇష్టంగా తింటారు. కానీ ఇది తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.. క్యాబేజీ తింటే ఈజీగా బరువు తగ్గొచ్చని చాలా మంది అంటారు. అసలు ఇందులో నిజమెంత..? ఈరోజు తెలుసుకుందాం.!

బరువు తగ్గడంలో క్యాబేజీ ఎలా పని చేస్తుంది?

క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కారకాలని నిరోధించి శుభ్రపరుస్తాయి. బరువు తగ్గడానికి క్యాబేజీ సహాయం చేస్తుంది. జీర్ణవ్యవస్థకి సరిగా ఉండేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీరం కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్, వాటర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొట్ట(గట్)ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీవక్రియని మెరుగుపరిచి టాక్సిన్స్‌ని బయటకి పంపేందుకు సహకరిస్తుంది.

క్యాబేజీని పులియబెట్టి తీసుకుంటే ప్రోబయోటిక్స్‌ని పెంచుతుంది. ఇది గట్ ఆరోగ్యానికి మంచిది. ఒక కప్పు క్యాబేజీ తీసుకుంటే 33 కేలరీలు అందుతాయి. కొవ్వు అసలు ఉండదు. ఫైబర్ ఎక్కువగా ఉండటం పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. కొవ్వును రక్తంలో శోషించకుండా బయటకి తీస్తుంది.

క్యాబేజీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్-C పుష్కలంగా ఉంటుంది. క్యాన్సర్ కణాల పురోగతిని నిరోధిస్తుంది. ఎర్ర క్యాబేజీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆంథోసైనిన్లు ఏర్పడటాన్ని నెమ్మదిస్తాయి. ఇప్పటికే శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలని కూడా ఇది సమర్థవంతంగా చంపుతుంది. క్యాబేజీలో ఉండే గ్లుటామైన్ అనే అమైనో యాసిడ్ బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏంజెట్ గా పనిచేస్తుంది. విటమిన్ కె ఉండటం వల్ల మెదడు ఆరోగ్యానికి మంచిది.

క్యాబేజీలో దాదాపు 20 రకాల ఫ్లేవనాయిడ్లు, 15 ఫినాల్స్ ఉన్నాయని పరిశోధకులు ఎప్పుడో చెప్పారు. ఇది కార్డియో వాస్కులర్ ప్రమాదాలని తగ్గిస్తుంది. కాల్షియం, పొటాషియం రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడతాయి.

కానీ ఈ ప్రమాదం ఉంది..

క్యాబేజీ చల్లని వాతావరణంలో పెరుగుతుంది. సహజంగా పోషకాలని కోరుకునే మొక్క. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర పరాన్నజీవులు ద్వారా సంక్రమణకి గురవుతుంది. అందుకే దీన్ని తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాబేజీ తీసుకోవడం వల్ల వాత, పిత్త, కఫాల్లో మార్పులు తీసుకొస్తుంది. క్యాబేజీ చల్లని వాతావరణంలో పెరగడం వల్ల వాతాన్ని పెంచుతుంది. వాత తీవ్రతని తగ్గించడానికి ఆకుకూరలు మెత్తగా కోసి అందులో వేసుకుని తినొచ్చు. సుగంధ ద్రవ్యాలు, నూనెతో బాగా ఉడికించుకుని తీసుకోవచ్చు. శీతాకాలం, వసంతకాలంలో ఇది పిత్త, కఫ దోషాలని పెంచుతుంది.

వాత సమస్య ఉన్న వాళ్ళు దీన్ని తింటే జీర్ణం కావడం కష్టం. వెనిగర్‌తో పులియబెట్టి తీసుకుంటే మంచిది. థైరాయిడ్ హార్మోన్లు పనితీరుకి అంతరాయం కలిగిస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్న వారు అసలు తినకపోవడం ఉత్తమం..తెలుగు వాళ్లు క్యాబేజీని కూరలా చేసుకునే తింటారు. కానీ నార్త్ సైడ్‌ క్యాబేజీని పచ్చిదే తింటారు. వాళ్లు ఇంకా ఇష్టపడి మరీ తింటారు తెలుసా..! సో క్యాబేజీ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి..అప్పుడప్పుడు అయినా తినడానికి ట్రై చేయండి. దీన్ని సలాడ్‌ చేసుకుని తినగలితే మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్‌ చేసుకోవచ్చు.!

Read more RELATED
Recommended to you

Latest news