సీఎం జగన్ కీలక నిర్ణయం…ఆరోగ్య శ్రీ ద్వారా క్యాన్సర్ కు చికిత్స…!

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులకు ఉత్తమ చికిత్స అందించేలా మూడు ప్రాంతాల్లో మూడు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. క్యాన్సర్ చికిత్స కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీ లోనే 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలని నిర్ణయించారు. అంతేకాకుండా క్యాన్సర్ కు చికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా అందించనున్నట్టు కూడా వైద్య శాఖ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు.

ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ప్రస్తుతం క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుతం ఎన్నో ఆరోగ్య సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చారు.