అమెరికాలో ఉండలేం మహా ప్రభో…

-

అగ్ర రాజ్య౦ అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతుంది. వేలాది మంది ప్రతీ రోజు కూడా అమెరికాలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ ఉండే భారతీయులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన విద్యార్ధులు అయితే తినడానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పులు చేసి తల్లి తండ్రులు పంపించారు.

వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్ళను ఆదుకునే దిక్కు గాని వాళ్ళను కాపాడే దిక్కు గాని ఇప్పుడు అమెరికాలో లేదు అనేది వాస్తవం. అక్కడి ప్రభుత్వం కూడా వాళ్ళను ఆదుకునే అవకాశం లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అయితే నరకం చూస్తున్నారు. అక్కడ ఒక మనిషి బ్రతకాలు అంటే కనీసం 80 వేల వరకు అవసరం ఉంటుంది.

ప్రతీ నెల ఖర్చు అది… చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండదు. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగం పోతే బ్రతకాలి అంటే అప్పులు చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. రోజు రోజుకి తీవ్రమవుతున్న కరోనా తీవ్రతను అంచనా వేయడ౦ అక్కడి ప్రభుత్వానికి కూడా సాధ్యం కావడం లేదు. దీనితో విదేశాంగ శాఖకు ఇప్పుడు అక్కడి వాళ్ళు దరఖాస్తులు చేస్తున్నారు.

తమను ఆదుకోవాలి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము ఒక్క రోజు కూడా ఇక్కడ ఉండలేము అని ఉంటే ఆత్మహత్య మినహా మరో మార్గం లేదని దయచేసి తమను ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి తమను తీసుకుని వెళ్ళాలి అని తమ కుటుంబాలు కూడా తమను ఆదుకునే స్థితిలో లేవు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు అమెరికా వద్దు అని వేడుకునే పరిస్థితిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news