పిల్లల కోసం కేర్‌టేకర్ జాబ్‌..జీతం రూ. 83లక్షలు ప్రకటించిన అమెరికన్‌ బిలియనీర్‌

-

ఉద్యోగం లేని వారికి ఇదొక గొప్ప ఆఫర్. 85 లక్షల జీతంతో ఉద్యోగం మీ కోసం ఎదురుచూస్తోంది. పని చాలా సులభం. ఇద్దరు పిల్లలను చూసుకోవాలి అంతే. ఆయాల వారి బాగోగులు చూసుకుంటే చాలు. కానీ ఈ ఉద్యోగం సాధించడం అంత సులభం కాదు. మీరు కొన్ని షరతులు పాటిస్తేనే మీకు ఉద్యోగం లభిస్తుంది.

ఈ ఉద్యోగాన్ని భారతీయ సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్, అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి ఆఫర్ చేశారు. తమ ఇద్దరు పిల్లలను చూసుకునే నానీ కోసం వెతుకుతున్నారు.నానీ రిక్రూట్‌మెంట్ కోసం వివేక్ రామస్వామి వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చాడు. ఉన్నత కుటుంబంలో చేరడానికి ఇది ఒక గొప్ప అవకాశం. పిల్లల ఎదుగుదల, అభివృద్ధి కోసం నానీ కుటుంబ సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థికి 1 లక్ష డాలర్లు అంటే దాదాపు 83 లక్షల రూపాయల జీతం చెల్లింస్తామని ప్రకటించారు.

నానీకి వారంలో చాలా రోజులు సెలవులు లభిస్తాయి :

ఎంపికైన అభ్యర్థి వారపు షిఫ్ట్ షెడ్యూల్ ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. మీరు వారంలో ఒక రోజు సెలవు పొందవచ్చు. ఏడాదికి 26 వారాలు పనిచేస్తే 83 లక్షల రూపాయల జీతం వస్తుంది.

ప్రైవేట్ విమానంలో ప్రయాణించే అవకాశం: ఆయాకు ప్రైవేట్ విమానంలో ప్రయాణించే అవకాశం కూడా లభిస్తుంది. వారానికోసారి నానీ ప్రైవేట్ విమానంలో ప్రయాణించాలని ప్రకటనలో ఉంది. అంటే ఎంచుకున్న నానీ కుటుంబంతో తరచుగా ప్రయాణించడానికి సిద్ధంగా ఉండాలి.

అసలు పని ఏంటి..?

సెలెక్ట్‌ అయిన నాని అదేనండీ.. ఆయా… గృహ సిబ్బందిలో భాగంగా ఉండాలి. హౌస్ సిబ్బందిలో చెఫ్, నర్సు, హౌస్ కీపర్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఉంటారు. ఆ నర్సు బృందంతో కలిసి పని చేయాలి. పిల్లల దినచర్యను నిర్ణయించడం, ప్రయాణానికి సంబంధించిన వస్తువులను ప్యాక్ చేయడం వంటి పనులు ఉంటాయి.

వయోపరిమితి ఎంత? : నర్సు ఉద్యోగానికి ఎంపికైన వారు ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. 21 ఏళ్లు పైబడిన యువత మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వారికి ఆయాగా పనిచేసిన అనుభవం ఉండాలి.

వివేక్ రామస్వామి కుటుంబం: వివేక్ రామస్వామికి ఇప్పుడు 38 సంవత్సరాలు. వివేక్ రామస్వామి అపూర్వ రామస్వామిని వివాహం చేసుకున్నాడు. యేల్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 2024 ఎన్నికల్లో జో బిడెన్‌ను ఎదుర్కొనేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు వివేక్ రామస్వామి ముందు వరుసలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news