ఇండియాలో కొంటున్న టాప్ 10 కార్లు ఇవే.. టాప్ లో మారుతీ వ్యాగనార్

-

ఇండియాలో క్రమంగా కార్ల కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. కరోనా తరువాత ప్రతీ కుటుంబానికి సొంతంగా ఓ కార్ ఉండాలని మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు. వీలయితే కొత్తది… లేకపోతే సెకండ్ హ్యాండ్ కార్ అయినా కొనాలని ఆశపడుతున్నారు. ఇదిలా ఉంటే మన ఇండియాలో అమ్ముడవుతున్న టాప్ 10 కార్లు ఏమిటో తెలుసా…?  ఈ 10 కార్లే ఇండియాలో భారీగా అమ్ముడవుతున్నాయి. 2022 మార్చి నెలలో ఇండియాలో అత్యధిక అమ్ముడైన టాప్ 10 కార్ల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్ 10లోె 6 కార్లు మారుతీ సుజుకీ కంపెనీకి సంబంధించినవే ఉన్నాయి.

ఇండియాలో అమ్ముడవుతున్న కార్లలో టాప్ ప్లేస్ లో ఉంది ‘మారుతి సుజుకీ వ్యాగనార్’. మార్చి నెలలో ఏకంగా 24634 యూనిట్లు అమ్ముడయ్యాయి. మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉండటంతో ఈ కార్ కొనేందుకు ఎక్కువగా మొగ్గు చూపతున్నారు. రెండో స్థానంలో ‘మారుతీ సుజుకీ డిజైర్’  18632 యూనిట్ల అమ్ముడయ్యాయి. మూడో స్థానంలో మారుతి సుజుకీ ‘బాలెనో’ ఉంది. మార్చి నెలలో బాలెనో కార్ 14520 యూనిట్లు అమ్ముడయ్యాయి. నాలుగో స్థానంలో ‘టాటా నెక్సాన్’ ఉంది. 14315 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఐదో స్థానంలో ‘మారుతీ సుజుకీ స్విఫ్ట్’ కారు ఉంది. మార్చి నెలలో స్విఫ్ట్ కారు 13623 కార్లు అమ్ముడయ్యాయి. ఆరోస్థానంలో 12439 యూనిట్లుతో ‘మారుతీ సుజుకీ విటారా బ్రేజా’ , ఏడో స్థానంలో హ్యుండాయ్ క్రేటా ఉండగా… ఎనిమిదో స్థానంలో టాటా పంచ్, తొమ్మిదో స్థానంలో హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ నియోస్, పదో స్థానంలో మారుతి సుజుకీ ఎకో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news