రోజాకు షాక్… హైకోర్ట్ లో కేసు…

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు లాక్ డౌన్ ని ఉల్లంఘించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రోజు రోజుకి కరోనా తీవ్రమవుతున్న సరే లాక్ డౌన్ ని సరిగా పాటించడం లేదని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. అటు వైసీపీలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు సహా ఇతర నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజని పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

టీడీపీ నేతలు పదే పదే వారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా వారి వ్యవహారంపై హైకోర్ట్ లో కేసు కూడా నమోదు అయింది. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. అధికార పార్టీ నేతలు వివిధ‌ సమావేశాల్లో పాల్గొంటున్నారని లాయర్ కిషోర్ పిటీషన్ దాఖలు చేసారు. వారిని అడ్డుకోవడంతో పాటు రూల్స్ పాటించ‌ని వైసీపీ నేత‌ల‌కు కరోనా పరీక్షలు నిర్వహించాలని పిటిషన్‌లో ఆయన కోరారు.

ఈ పిల్‌లో ప్రతివాదులుగా న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుద‌ల రజినీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడలను చేర్చాలని కిషోర్ తన పిటీషన్ లో విజ్ఞప్తి చేసారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న అమలులో ఉన్న సమయంలో వైసీపీ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని ఆయన పిటీషన్ లో ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news