ఇటీవల కాలంలో చాలా మంది ఇంటికి పరిమితమవుతూ ఒకే ప్రదేశంలో ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తూ ఉన్నారు ఇలా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల కాళ్లు నొప్పులు కీళ్ల నొప్పులతో పాటు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిజానికి ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్లల్లో రక్త సరఫరా తగ్గిపోతుంది.. ఫలితంగా కండరాలలో నొప్పులు, వాపులు , ఒక్కొక్కసారి భరించలేనంత నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఇటీవల చాలామంది ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. కేవలం పాదాల నొప్పులు మాత్రమే కాదు జుట్టు సంబంధిత, చర్మ సంబంధిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు
ఆముదం ఉపయోగించి ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టవచ్చు. ఇకపోతే ఆముదం నూనెను కాళ్లలో వాపు వచ్చినప్పుడు , నొప్పుల దగ్గర మర్దన చేస్తే ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఆముదం తో పాదాలకు మసాజ్ చేయడం వల్ల కండరాలలో ఫ్లెక్సిబిలిటీ ఏర్పడి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనిషికి ప్రశాంతమైన నిద్ర కూడా వస్తుంది. ఇక వీటితో పాటు ఆముదం వల్ల మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇక ఆముదం నూనె లో అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల దీర్ఘకాలిక కీళ్లనొప్పులకు కూడా మంచి ఉపశమనం కలిగిస్తాయి.
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆముదం తో మసాజ్ చేస్తే మరీ మంచిది. జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు వారానికి రెండుసార్లు ఆముదం తో జుట్టు కుదుళ్ల లో అప్లై చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి జుట్టు పెరుగుదలను ఎవరు ఆపలేరు. ఇక మడమలు, పగుళ్ళను తగ్గించుకోవడానికి కూడా ఆముదం చాలా చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం పాదాలను శుభ్రంగా కడిగి చీలమండలం పై అప్లై చేసి మర్దనా చేయాలి. ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి.