గుంటూరు అర్బన్ పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసింది. గుంటూరులో గతంలో కలకలం రేపిన క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హజరుపర్చ లేదు. వారిని విచారణ పేరిట తీసుకు వెళ్లి కోర్టులో హాజరు పరచక పోవడంతో ఆ ముగ్గురు వ్యక్తుల భార్యలు హైకోర్టు లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ భర్తలను తీసుకువెళ్ళిన అర్బన్ పోలీసులు వారిని ఎక్కడ ఉంచారో తెలియదని పేర్కొన్నారు.

దీంతో అర్బన్ పోలీసులపై జూడిషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. జూడిషియల్ విచారణలో పోలీసులు తమను ఇబ్బంది పెట్టారని ఆ ముగ్గురు వ్యక్తులు చెప్పడంతో అర్బన్ పోలీసులపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. అర్బన్ ఎస్పీ రామకృష్ణ సమయంలోనే ఆయన మీద సిబిఐ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం అర్బన్ పోలీసులు చేసింది తప్పేనని భావించి వారి మీద కేసు నమోదు చేసింది సిబిఐ.