ఏపీలో ఘొరం.. బోల్తా పడ్డ అంబులెన్స్..!

-

ప్రమాదానికి గురైనవారిని రక్షించడానికి వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కంచిలి మండలం జలంత్ర కోట జంక్షన్ వద్ద జాతీయరహదారిపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది.

లారీని అధికమించే క్రమంలో అడుపుతప్పిన అంబులెన్స్ బోల్తా పడి పక్కనే ఉన్న వరద కాలువలో పడిపోయింది. అయితే ఆ సమయంలో డ్రైవర్ మినహా ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిన్నపాటి గాయాలతో బయటపడ్డ డ్రైవర్ ను గమనించిన కొందరు స్థానికులు మెరుగైన చికిత్స కోసం బరంపురం ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news