ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ రొటోమాక్ పై సీబీఐ కేసు

-

పీఎన్బీలో ఎల్వోయూల నయామోసం బయటపడటంతో బ్యాంకులు ఇతర ఎగవేతదారులపై ద్రుష్టి సారించడంతో రొటోమాక్ పెన్స్
యజమాని విక్రం కొఠారీ రుణాల బాగోతం బయట పడింది. దీంతో రొటోమాక్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును రూ. 750 కోట్ల మేర మోసం చేసిందని రొటోమాక్ పై అభియోగాలను నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్లు సాధన కొఠారి, రాహుల్ కొఠారిలై సెక్షన్ 120బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 420 (చీటింగ్) కింద అభియోగాలు మోపింది.

Rotomac Pen : 'పెన్ను' పై కేసు పెట్టిన సీబీఐ.. బ్యాంకులో రూ.750కోట్లకు  టోకరా - NTV Telugu

బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్టియం నుంచి ఈ కంపెనీ మొత్తం రూ. 2,919 కోట్ల అప్పు కలిగి ఉంది. ఇందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాటా 23 శాతం. 2016 జూన్ 30న పేమెంట్లలో ఈ కంపెనీ డిఫాల్ట్ అయింది. ఆ తర్వాత రూ. 750.54 కోట్ల బకాయితో నిరర్థక ఆస్తిగా ప్రకటించబడింది. కన్సార్టియం సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే ఈ కంపెనీని సీబీఐ, ఈడీలు విచారణ జరిపాయి. తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news