కేసీఆర్ లో భయం మొదలైంది : బండి సంజయ్‌

టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో భాగంగా తన కుమార్తెనే పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు అడిగారన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బుధవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బుధవారం హైదరాబాద్ లో పలు మీడియా సంస్థలతో ఇస్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. ఢిల్లీ చుట్టూ తిరిగినా కేసీఆర్ నే తాము చేర్చుకోలేదన్న సంజయ్… కవితను ఎలా చేర్చుకుంటామని ఎదురు ప్రశ్నించారు. కేసీఆర్ ఎలాంటి యుద్ధం చేసినా తాము సిద్ధంగానే ఉన్నామన్న సంజయ్… టీఆర్ఎస్ కంటే ముందు యుద్ధం ప్రారంభించామని తెలిపారు.

Telangana BJP chief Bandi Sanjay Kumar held over protest against arrest of  workers - India Today

ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్ల లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. కేసీఆర్ లో భయం మొదలైందన్న విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే గుర్తించారని కూడా సంజయ్ వ్యాఖ్యానించారు. అసలు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంపై ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారన్నారు. బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకోవాలని, అదే సమయంలో టీఆర్ఎస్ గెలవాలని కేసీఆర్ చెబుతున్నారని అన్నారు బండి సంజయ్.