VIDEO: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి.. 13 మంది మృతి!

-

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణుల దాడికి పాల్పడింది. యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ 229 రోజులైనా.. ఇంకా తీవ్రరూపం దాల్చుతోంది. ఇటీవల క్రిమియా దగ్గరున్న వంతెనను ఉక్రెయిన్‌ కూల్చివేయడంతో రష్యా ప్రతీకార దాడులకు పాల్పడింది. తాజాగా జరిపిన క్షిపణుల దాడిలో 13 మంది మృతి చెందారు. దాదాపు 60 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. జఫోరిజ్జియాలోని నివాస ప్రాంతాలే లక్ష్యంగా రష్యా ఇప్పటివరకు 75 క్షిపణులతో దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఉక్రెయిన్-క్షిపణుల దాడి
ఉక్రెయిన్-క్షిపణుల దాడి

దీంతో ఉక్రెయిన్ మరోసారి భయాందోళనకు గురవుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ అధ్యక్ష కార్యాలయంపై కూడా రష్యా దాడులకు పాల్పడింది. అయితే మరోవైపు ఉక్రెయిన్ దాడిలో తమ బలగాలకు భారీ నష్టం జరిగిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తెలిపారు. పుతిన్ అధ్యక్షతన జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో క్రిమియా బ్రిడ్జి కూల్చివేత అంశంపై చర్చించినట్లు రష్యన్ మీడియా ప్రస్తావించింది.

Read more RELATED
Recommended to you

Latest news