బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య వ్యవహారంపై విచారణలో సిబిఐ అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని అడగడానికి 24 ప్రశ్నలను సిద్దం చేసింది. ఇప్పటికే సుశాంత్ ఇంటి వద్ద నుంచి కీలక ఆధారాలను సేకరించిన సిబిఐ ఆమె కోసం కొన్ని కీలక ప్రశ్నలను రెడీ గా ఉంచారు. ఆమెను సిబిఐ అడగాలి అనుకునే ప్రశ్నలను ఏమిటో కింద చూద్దాం.
సుశాంత్ కి మీరు ఏమైనా మందులు ఇచ్చారా…? మీరు సుశాంత్ సింగ్ కోసం ఎవరిని అయినా డాక్టర్ ని కలవాలి అని అపాయింట్మెంట్ తీసుకున్నారా…? మీ తండ్రి సుశాంత్ సింగ్ కి ఏమైనా మందులు సూచించారా…? అనే ప్రశ్నలను సిబిఐ రెడీ చేసింది. సుశాంత్ మానసిక వ్యాధి తో బాధ పడుతుంటే అతనికి రియా తండ్రి మందులు సూచించారు అనే ఆరోపణలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.