మీ అకౌంట్లో అలా వచ్చిన డబ్బు ఉందా..? అయితే మీరు నిండా మునిగినట్లే

-

భారతదేశంలోని చట్టాల్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయని ఆర్థిక నిపుణులు, న్యాయ శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఆర్థికపరమైన చట్టాలను కన్ఫ్యూజ్ చేసేందుకు వాటిలోని చిన్నచిన్న సవరణలను ఆసరాగా చేసుకుని పన్ను చెల్లించచుండా ఉండేందుకు ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన చట్టం మాత్రం పన్ను ఎగవేతదారుల తాట తీస్తోంది. ఇన్కమ్ టాక్స్ యాక్ట్ అనగా ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 69-ఏ ప్రకారం మీ అకౌంట్ లో ఉన్న అటువంటి డబ్బులు కి 83 శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది.

వివరాల్లోకి వెళితే.. మీ అకౌంట్ లోకి వచ్చిన డబ్బు, బంగారం, జువెలరీ లేదా ఇంకా ఏ విలువైన వస్తువు ద్వారా లేదా ఆ రూపంలో మీ వద్ద ఆస్థి ఉన్నా సరే… మీరు అసెసింగ్ ఆఫీసర్ కు అందుకు సంబంధించిన మూలాన్ని లేదా మీకు ఇచ్చిన వ్యక్తి యొక్క ప్రయోజనాన్ని సరిగ్గా వివరించలేకపోతే మీరు దాదాపు 83.25 శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది. అందులో 60 శాతం టాక్స్ + 25 శాతం సర్చార్జి + 6 శాతం పెనాల్టీ ఉంటాయి. ఒకవేళ మీ అకౌంట్లో ఉన్న ఆ వివరించలేని డబ్బు, నగదు, బంగారం రూపంలో ఉన్నదని మీరు గత సంవత్సరం కట్టిన ఆదాయ పన్ను లెక్కల్లో లో చూపించి న్యాయబద్ధమైన ట్యాక్స్ కట్టి ఉంటే 6% పెనాల్టీ మాత్రమే ఉండదు. అంటే…. అప్పటికీ మీరు 85 శాతం మొత్తం చెల్లించాల్సిందే.

ఇక బంగారం, వస్తువులు కాకుండా డబ్బు మీ అకౌంట్ లోకి నేరుగా ఎలా వచ్చిందో…. ఎందుకు వచ్చిందో.. ఏ ప్రయోజనం కింద వచ్చిందో చెప్పలేకపోతే పైన చెప్పిన దానికన్నా ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. 2017 లో డిమానిటజేషన్ జరిగిన సమయంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు అయిన పిమ్మట ఎంతోమంది బ్యాంక్ అకౌంట్ లోకి నిర్ణీత కాలంలో భారీగా డబ్బు వచ్చి పడింది. దీని గురించి ఇన్కమ్ టాక్స్ ఆరా తీస్తోంది. డబ్బుని బంగారంగా మార్చేసినా.. విలువైన వస్తువులు కొని పెట్టేసినా.. అసెసింగ్ ఆఫీసర్ వచ్చి వాటికి సంబంధించిన వివరణ అడుగుతారు.

మీ వివరణతో అతను సంతృప్తి చెందకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిర్దేశిత పన్ను మొత్తం చెల్లించక తప్పదు. మీకు వాదనలు, ప్రతి వాదనలు, కోర్టులు, డిబేట్లు వంటివి ఏమీ ఉండవు. కచ్చితంగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చెప్పినట్లు విని తీరాల్సిందే. లేదా.. జైలు ఊచలు లెక్క పెట్టాలనుకుంటే అది మీ ఇష్టం..!

Read more RELATED
Recommended to you

Latest news