UnstoppableWithNBK2 : బాలయ్య షోకు చంద్రబాబు

-

సినిమాల‌తోనే కాకుండా హోస్ట్ గా త‌న‌లోని మ‌రో టాలెంట్ ను బ‌య‌ట పెడుతూ.. దిగ్విజ‌యంగా ముందుకు సాగుతున్నారు హీరో నంద‌మూరి బాల కృష్ణ‌. తెలుగు ఓటీటీ ఆహా వేదిక‌గా ప్ర‌సార‌మ‌వుతున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే అనే షో లో బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ టాక్ షో కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

టాలీవుడ్‌ స్టార్లు ఈ షోకు వచ్చి సందడి చేశారు. అయితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ మళ్లీ రాబోతోంది. ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ తో బాలయ్య రానున్నారు.

 

మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ ని మరింత గ్రాండ్ సక్సెస్ గా చేయడానికి సెకండ్ సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి, అనుష్క శెట్టి, వంటి వారిని హీరోలను తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒక ఎపిసోడ్ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news