ఫేక్ బ్యాంక్ గ్యారంటీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాని పట్టుకున్న సిసిఎస్ పోలీసులు

-

ఫేక్ బ్యాంక్ గ్యారంటి పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు సీసీఎస్ పోలీసులు. కోల్ కత్తా కేంద్రంగా ఫేక్ బ్యాంక్ గ్యారంటీలతో మోసాలకు పాల్పడుతుంది ఈ గ్యాంగ్. వారి వద్ద నుండి రెండు చెక్కులు, నకిలీ బ్యాంక్ గ్యారంటీ పత్రాలు,5 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బషీర్బాగ్ సిపి ఆఫీస్ లో సిసిఎస్ అడిషనల్ డిసిపి నేహా మెహ్ర మాట్లాడుతూ..

“వరంగల్ కు చెందిన నాగరాజు అనే వ్యక్తికి కోల్ కత్తా కు చెందిన నరేష్ శర్మ, దాసు, సుబ్రజిత్ గోషాల్ వారితో పరిచయం అయ్యింది. హశ్రిత ఇన్ఫ్రా కంపెనీ కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బయో మైనింగ్ కు కాంట్రాక్టు వచ్చింది. ప్రాజెవెల్, సందీప్ రెడ్డి, నాగరాజు ను అప్రోచ్ అయ్యారు. 14 శాతం కమిషన్ పై ఇండస్ ఇండ్ బ్యాంక్ పేరుతో కోటి రూపాయల విలువ గల గ్యారెంటీ పత్రాలు నాగరాజు అందించారు.

47 లక్షలు కమిషన్ గా పొందాడు. హార్షిత కంపెనీకి నల్గొండ జిల్లా లో 11 బయో మైనింగ్ కాంట్రాక్టు లు మంజూరు అయ్యాయి. వీటికి బ్యాంక్ గ్యారంటీ పాత్రలు 2 కోట్ల 25 లక్షలకు అందించాడు. వెరిఫికేషన్ కు పంపగా ఈ బ్యాంక్ గ్యారంటీ పత్రాలు ఫేక్ అని తేలాయ్. నిందితులు ఇప్పటి వరకు తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాలలో 60 నకిలీ పత్రాలను కమిషన్ పై అందించారు. ఆ నకిలీ పత్రాల విలువ 35 కోట్లు ఉంటుంది” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version