కేంద్రంలో ఎన్డిఎ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి… సామాన్య ప్రజలకు షాక్ ఇచ్చేలా.. నిత్యవసర వస్తువులు, పెట్రోల్ అలాగే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా పెట్రోలు మరియు గ్యాస్ ధరలు అయితే ఆకాశాన్ని అంటాయి. మధ్యతరగతి కుటుంబాలు కొన్ని స్థితిలోకి వీటి ధరలు పెరిగిపోయాయి.
అయితే తాజాగా సిమెంటు ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంట్ బస్తా ధర 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచే పెంచిన ధరలు అమలులోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముడిపదార్థాల అధిక ధరలతో పాటు ఇంధన వ్యయాలు తిరగడమే కారణమని వివరించాయి కంపెనీలు. తెలుగు రాష్ట్రాల్లో బస్తా పై 20 రూపాయలు వెనక తమిళనాడు రాష్ట్రంలో 30 రూపాయల వరకు సిమెంట్ బస్తా ధర పెరిగింది. కొత్త ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఒక సిమెంట్ బస్తా ధర…320 రూపాయల నుంచి 400 వరకు పెరిగింది.