కరీంనగర్ జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

-

కరీంనగర్‌ జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరీంనగర్‌ జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా.. కరీంనగర్‌ జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఇకపై కేంద్ర రక్షణ శాఖ పరిధిలోకి రానుంది.

సైనిక్ స్కూల్ లో అడ్మిషన్లు సహా స్కూల్ నిర్వహణ వ్యయాన్ని ఇకపై పూర్తిగా భరించనుంది కేంద్ర ప్రభుత్వం. ఆల్-ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఈ సైనిక్ స్కూల్ లో 6వ తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారన్న మాట. కరీంనగర్‌ జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గానికి కేంద్రం సైనిక్ స్కూల్ ని మంజూరు చేసిందని.. ప్రధానికి, సంబంధిత మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news