బంగారం, వెండి కొనుగోలు దారులకు భారీ ఊరట వచ్చింది. గత కొద్ది రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరల నుంచి కాస్త ఉపశమనం కలిగింది. నేడు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అలాగే వెండి ధరలు ఈ రోజు భారీగా తగ్గాయి. ఒక కిలో గ్రాము వెండిపై రూ. 400 వరకు తగ్గింది. దీంతో గత ఆరు రోజుల్లో వెండి ధరలు తగ్గడం ఇది రెండో సారి.
కాగ ఈ వారం రోజుల్లో వెండి ధరలు రూ. 3,000 వరకు పెరిగాయి. ఇదే వారంలో రూ. 1,900 తగ్గాయి. అలాగే బంగారం కూడా గత వారం రోజుల్లో రూ. 1,420 వరకు పెరిగింది. కాగ నేడు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. కాగ నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 73,400 గా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 73,400 గా ఉంది.