అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం గుడ్‌ న్యూస్..ఆంక్షలు ఎత్తివేత

-

విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభ వార్త చెప్పింది. వారికి ఇప్పటివరకు ఉన్న తప్పనిసరిగా క్వారంటైన్, ఆర్ టి పి సి ఆర్ పరీక్షల నిబంధనలు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సవరించిన నిబంధనలకు తాజాగా విడుదల చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్ టి పి సి ఆర్ నెగిటివ్ రిపోర్ట్ తో పాటు వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు ఆదేశాలు జారీ చేసిన సర్టిఫికెట్ అప్లోడ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది.

అలాగే దేశంలో అడుగు పెట్టిన తర్వాత ఎనిమిదోరోజు ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేయించుకుని దాని రిపోర్టును… ఎయిర్ సువిధ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలన్న నిబంధన కూడా తొలగించారు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులు నమూనాలు ఇచ్చి విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లి పోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలను కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. బదులుగా ఇండియా లో ల్యాండ్ అయిన తర్వాత 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో చేసుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news